బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 20, 2020 , 15:10:02

10వేలు దాటిన క‌రోనా మృతులు

10వేలు దాటిన క‌రోనా మృతులు

హైద‌రాబాద్:  నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య ప‌ది వేలు దాటింది.  అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ విష‌యాన్ని చెప్పింది.  గ‌త ఏడాది క‌రోనా ప్ర‌బ‌లిన నాటి నుంచి హాప్‌కిన్స్ వ‌ర్సిటీ మ‌ర‌ణాల సంఖ్య‌ను న‌మోదు చేస్తోంది.  అయితే ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల 50 వేల‌కు చేరుకుంటోంది.  అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నిషేధ ఆజ్ఞ‌లు జారీ చేసింది.  ఆ రాష్ట్రంలో సుమారు 40 మిలియ‌న్ల జ‌నాభా ఉన్న‌ది.  ఇటలీలో నిన్న ఒక్క రోజే 427 మంది మ‌ర‌ణించారు.  చైనా మృతుల సంఖ్య‌ను ఇట‌లీ దాటేసింది. 

సునామీలా కేసుల వెల్లువ‌..

భార‌త్‌లో కరోనా కేసులు సునామీలా విరుచుకుప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ డైన‌మిక్స్, ఎక‌నామిక్స్ అండ్ పాల‌సీ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ర‌మ‌ణ‌న్ ల‌క్ష్మీనార‌య‌ణ తెలిపారు.  త్వ‌ర‌లోనే ఈ ప‌రిస్థితి ఇండియాలో ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు.  బ్రిట‌న్‌, అమెరికా త‌ర‌హాలో ఇండియాలో వైర‌స్ వ్యాప్తి చెందితే.. ఇక్క‌డ సుమారు 30 కోట్ల‌ కేసులు న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.  దాంట్లో సుమారు 50 ల‌క్ష‌ల కేసులు సీవియ‌ర్‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. కానీ భార‌త్ ఇప్ప‌టికే వైర‌స్ క‌ట్టడి కోసం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది.  ప్ర‌స్తుతానికి భార‌త్‌లో 200 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.   


logo