శనివారం 06 జూన్ 2020
International - May 11, 2020 , 19:54:00

ప్రపంచవ్యాప్తంగా 2.8లక్షల కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా 2.8లక్షల కరోనా మరణాలు

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా  సోమవారం సాయంత్రం వరకు 41,32,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 13,29,885 మంది వైరస్‌ బారినపడ్డారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం...  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ  2,83,387 మంది కోవిడ్-19 రోగులు మృతిచెందారు. అమెరికాలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ఇవాళ్టి వరకు 79,531 మంది మరణించారు.

బ్రిటన్‌(32,140), ఇటలీ(30,560 ), స్పెయిన్‌(26,621), ఫ్రాన్స్‌(26,383), బ్రెజిల్‌(11,207), బెల్జియం(8,707) దేశాల్లో ఎక్కువ కరోనా మరణాలు  సంభవించాయి. మరోవైపు అతిపెద్ద దేశం రష్యా, బ్రెజిల్‌లో కరోనా విజృంభిస్తూనే ఉంది. 


logo