ఆదివారం 07 జూన్ 2020
International - Apr 02, 2020 , 12:02:06

వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మృతుల సంఖ్య

వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మృతుల సంఖ్య

హైదరాబాద్‌: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు ఆ వైరస్‌ భారిన పడని దేశమే లేదు. ఆయా దేశాల్లో నమోదవుతున్న కేసులు, మరణాల  సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. చైనాలో తగ్గుముకం పట్టినప్పటికీ ఇతర దేశాలను ఈ వైరస్‌ అతలాకుతలం చేస్తున్నది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు 9,36,297 నమోదవగా, అందులో 47,250 మంది మరణించారు. 1,94,585 మంది కోలుకోగా, 35,611 మంది ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. మరణించినవారిలో వయస్సు పరంగా చూస్తే.. 80 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 14.8 శాతం మంది, 70 నుంచి 79 ఏండ్లలోపు వారు 8 శాతం మంది, 60-69 ఏండ్ల లోపు ఉన్నవారు 3.6 శాతం మంది ఉన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే 40 ఏండ్లలోపు ఉన్నవారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపలేకపోతున్నది. 10 నుంచి 19 ఏండ్లలోపువారు 0.2 శాతం, 20 నుంచి 29 ఏండ్లు, 30-39 ఏండ్ల వరకు 0.2 శాతం చొప్పున, 40-49 ఏండ్ల వయస్సున్నవారు 0.4 శాతం, 50-59 ఏండ్లలోపువారు 1.3 శాతం మంది ఉన్నారు.   

ఇక దేశాల పరంగా చూస్తే ఇప్పటివరకు అమెరికాలో పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. మొత్తంగా ఆ దేశంలో 2,15,300 కేసులు నమోదుకాగా, 5,110 మంది మరణించారు. ఇటలీలో ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 1,10,574 కేసులు నమోదవగా, 13,155 మంది మరణించారు. స్పెయిన్‌లో 1,04118 కేసులు నమోదుకాగా, 9,387 మంది మరణించారు. వైరస్‌ పుట్టిల్లు చైనాలో 81,554 కేసులు రికార్డవగా, 3,312 మంది మరణించారు. 

జర్మనీలో 77,981 కేసులు, 931 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 56989 కేసులు నమోదవగా, 4,032 మంది మరణించారు. ఇరాన్‌లో 47,593 కేసులు నమోదవగా, 3,036 మంది మరణించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో నమోదైన 29,474 కేసుల్లో 2,352 మంది మరణించారు. స్విట్జర్లాండ్‌లో 17,768 కేసులు నమోదవగా, 488 మంది మరణించారు. నెదర్లాండ్స్‌లో 13,964 కేసులు, 1,173 మరణాలు సంభవించాయి. దక్షిణ కొరియాలో 9,976 కేసులు నమోదవగా, 169 మంది ఈ వైరస్‌ బారినపడి మరణించారు. 


logo