శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 14:08:24

24 గంటల్లో 2.76 లక్షల కరోనా కేసులు

24 గంటల్లో 2.76 లక్షల కరోనా కేసులు

జెనివా (స్విజ్జ‌ర్లాండ్‌) : ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండా ఐదు వేలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా 2.76 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 6,933 మంది వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది.

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 20.4 మిలియన్ల మందికిపైగా కరోనా బారినపగా 7.44 లక్షల మంది మృత్యువాతపడ్డారని పేర్కొంది. వైరస్‌ ఉద్ధృతికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5.26 మిలియన్ల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. ఆ తరువాతి స్థానం బ్రెజిల్‌ ఆక్రమించింది. బ్రెజిల్‌లో 3.22 మిలియన్లకు పైగా కరోనా కేసులున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  logo