శుక్రవారం 05 జూన్ 2020
International - May 20, 2020 , 16:14:51

ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ: చాలా దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది.  లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కొన్నిదేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు  ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  50 లక్షలు దాటింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా  3.25లక్షల మంది మృతి చెందారు. అలాగే  కరోనా నుంచి 19.72లక్షల మంది కోలుకున్నారు. 

ప్రస్తుతం 27,06,730 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 45,400 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. అత్యధికంగా అమెరికా(1,571,018), రష్యా(308,70), స్పెయిన్‌(278,803), బ్రెజిల్‌(271,885) దేశాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్‌  నిర్ధారణ అయింది. 


logo