బుధవారం 02 డిసెంబర్ 2020
International - Oct 30, 2020 , 15:36:09

4.5 కోట్ల పాజిటివ్ కేసులు: జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ

4.5 కోట్ల పాజిటివ్ కేసులు:  జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ

హైద‌రాబాద్‌:  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4.5 కోట్లు దాటింది. ఈ విష‌యాన్ని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ వెల్ల‌డించింది.  క‌రోనా వైర‌స్ వ్యాప్తికి సంబంధించిన డేటాబేస్‌ను జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ మెయిన్‌టేన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో వైపు నిన్న ఒక్క రోజే అమెరికాలో 87,164 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఒక రోజు కేసుల్లో ఇదే అత్య‌ధిక రికార్డు అని నిపుణులు చెబుతున్నారు.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 89 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 2,28,000 మంది మ‌ర‌ణించారు.  మ‌రో వైపు అధ్య‌క్ష ఎన్నిక‌ల కోసం ట్రంప్‌, బైడెన్‌లు కీల‌క రాష్ట్ర‌మైన ఫ్లోరిడాలో జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఒపీనియ‌న్ పోల్స్ ప్ర‌కారం ఫ్లోరిడాలో ఇద్ద‌రూ నువ్వానేనా అన్న‌ట్లుగా పోటీప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 2016 ఎన్నిక‌ల్లో ట్రంప్ ఈ రాష్ట్రంలో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేశారు.