శనివారం 06 జూన్ 2020
International - Apr 29, 2020 , 21:29:15

5 గంట‌లు.. ఓపిక‌గా సింహాల‌తో పోరాడి గెలిచిన జిరాఫీ!

5 గంట‌లు.. ఓపిక‌గా సింహాల‌తో పోరాడి గెలిచిన జిరాఫీ!

హైదరాబాద్ : స‌హ‌నం.. అంటే ఇదేనేమో. అంత ఎత్తు ఉన్న జిరాఫీని చీల్చుకొని తిన‌డానికి ఐదు సింహాలు, ఐదు గంట‌లపాటు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాయి. ఏ మాత్రం జిరాఫీ లొంగినా ప్రాణాలు కోల్పేయేది. ఓపిక‌తో త‌ల‌దించ‌కుండా నిల్చున్న‌ది. ఈ పిల్ల సింహాలు ఎలాగైనా జిరాఫీని ప‌డేయాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. వెనుక‌నున్న రెండు కాళ్ల‌ను రెండు సింహాలు ప‌ట్టుకొని నోటితో పీక్కుతింటుంటే.. జిరాఫీ ఏమాత్రం చ‌లించ‌లేదు. కింద ప‌డ‌క‌పోవ‌డంతో ఒక సింహం ఏకంగా చెట్టు ఎక్కిన‌ట్లుగా పైకి ఎక్కింది. అయినా లాభం లేక‌పోయింది. దీంతో ఐదు సింహాల‌కు చిరాకు వ‌చ్చి, ఇది కాక‌పోతే ఇంకోటి అన్న‌ట్లు జిరాఫీని వ‌దిలేసి తిరుగుముఖం ప‌ట్టాయి. 


logo