వాషింగ్టన్: ఒక పాండా పిల్ల తన చేష్టలతో నెటిజన్లను ఆకట్టుకున్నది. ఒక బంతిని కాళ్లపై చాలా సేపు ఆడింది. అనంతరం ఆ బాల్ ఒక టబ్‌లో పడటంతో దాని కోసం అది కూడా అందులోకి దిగింది. అయితే బయటకు రాలేక ఇబ్బంది పడింది. అంతలో అక్కడకు వచ్చిన తల్లి పాండా తన పిల్లను నోటితో పట్టుకుని లాగింది. దీంతో ఆ టబ్ బోర్లా పడటంతో పాండా పిల్ల బయటకు వచ్చింది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ జూలాజికల్ పార్క్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. కాలితో బంతిని ట్రింబ్లింగ్ చేయడంలో పోటీ పెడితే పిల్ల పాండానే గెలుస్తుందని పలువురు నెటిజన్లు చమత్కరించారు. అలాగే పిల్లను టబ్ నుంచి బయటకు తీసిన తల్లి పాండా తెలివిని మెచ్చుకున్నారు.