మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 29, 2020 , 22:04:55

పుల్వామా దాడి చేసింది మేమే: పాక్ మంత్రి

పుల్వామా దాడి చేసింది మేమే: పాక్ మంత్రి

ఇస్లామాబాద్‌ : గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది భారత పారామిలిటరీ సైనికులు మరణించిన ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కారణమని పాకిస్తాన్ మంత్రి ఆ దేశ శాసనసభకు తెలియజేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి స్పాన్సర్ చేయడంలో దేశం పాత్రను స్పష్టంగా అంగీకరించారు. భారత్‌లోకి చొరబడి కొట్టామని జాతీయ అసెంబ్లీలో సభ్యుల సాక్షిగా చెప్పిన మంత్రి ఫవాద్‌ చౌదరి.. అనంతరం మాట మార్చి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

జాతీయ అసెంబ్లీలో చర్చ సందర్భంగా బెలూచిస్తాన్‌ ఎంపీలు మోదీ, మోదీ  అంటూ నినాదాలు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు "హమ్నే హిందుస్తాన్ కో గుస్ కే మారా (మేము వారి ఇంటిలోకి చొరబడి కొట్టాం). పుల్వామాలో మాదే విజయం. ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలో ప్రజల విజయం. మీరు, మనమందరమూ ఆ విజయంలో భాగస్థులం" అని పాకిస్తాన్‌ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లడించారు. ఈ ప్రకటన అసెంబ్లీలో కలకలం రేపింది. దాంతో తన మాటలను తప్పుగా అన్వయించుకోవద్దని, "పుల్వామా కే వాకియేహ్ కే బాద్, జబ్ హమ్నే ఇండియా కో గుస్ కే మారా (పుల్వామాలో జరిగిన సంఘటన తర్వాత మేము వారి ఇంటిలోకి చొరబడి కొట్టాం) అని చెప్పుకొచ్చారు. తర్వాత ఒక ట్వీట్‌లో "మా విమానాలు పోరాట సంస్థాపనలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు చొరబడి కొట్టాం" అని పేర్కొన్నారు. "అమాయకులను చంపడం ద్వారా మేం ధైర్యాన్ని చూపించం, ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం" అని ఆయన చెప్పుకొచ్చారు.

పుల్వామాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్పై ఫిబ్రవరి 14 న జరిగిన ఆత్మాహుతి దాడిపై భారత్ స్పందించింది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఫైటర్ జెట్లను పంపడం ద్వారా పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకున్నదని భారత్‌ పేర్కొన్నది. భారత వైమానిక దళం పాకిస్తాన్‌ విమానాలను అడ్డుకుంటూ వెళ్లి నియంత్రణ రేఖను దాటింది. దాని పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమన్‌ను పాకిస్తాన్ బలగాలు తమ అదుపులోకి తీసుకుని రెండు రోజుల తరువాత విడుదల చేశారు. వైమానిక ఎన్‌కౌంటర్ తర్వాత విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి, ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మధ్య జరిగిన సమావేశం గురించి ప్రతిపక్ష నేత అయాజ్ సాదిక్ ఇటీవల వెల్లడించడంపై పుల్వామాపై పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి చెప్పాల్సి వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.