ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 01:49:42

పుతిన్‌ ప్రత్యర్థిపై సోవియెట్‌ నాటి విషం!

పుతిన్‌ ప్రత్యర్థిపై సోవియెట్‌ నాటి విషం!

  • జర్మనీ ప్రభుత్వం వెల్లడి -ఆరోపణలను కొట్టేసిన రష్యా

బెర్లిన్‌: సోవియట్‌ కాలం నాటి కెమికల్‌ నెర్వ్‌ ఏజెంట్‌ ‘నొవిచోక్‌' ద్వారానే రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని జర్మనీ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. దీనిపై రష్యా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. 2018లో బ్రిటన్‌లో మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్‌, ఆయన కుమార్తెపై కూడా నొవిచోక్‌ ద్వారానే విషప్రయోగం జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే నావల్నీని అంతమొందిచేందుకే ఈ విషప్రయోగం జరిగిందని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఆరోపించారు. రసాయనిక ఆయుధం వాడడం అసాధారణమని, దీనిపై రష్యా వివరణ ఇవ్వాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కోరారు. మరోవైపు, రష్యా ఈ ఆరోపణలను ఖండించింది.


logo