శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 03, 2020 , 15:57:22

జర్మనీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

జర్మనీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

హైదరాబాద్‌: జర్మనీలో కరోనా కేసులు, మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో దేశంలో కేసుల సంఖ్య 79,696కు చేరింది.  గురువారం ఇది 6174గా ఉన్నది.  అదేవిధంగా 140గా కరోనా మృతుల సంఖ్య 1,017కు పెరిగింది. కొత్తగా బావరియాలో 20,237, నార్త్‌ రైన్‌వెస్ట్‌ఫాలియాలో 16,606, బాడెన్‌ వట్టెంబర్గ్‌లో 16059, బెర్లిన్‌లో 3202 కేసులు నమోదవడంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 79,696కు చేరింది. దీంతో ఐరోపాలో ఇటలీ (1,15,242), స్పెయిన్‌ (1,12,065) తర్వాత అత్యధిక కరోనా కేసులు రికార్డయిన దేశంగా జర్మనీ నిలిచింది. మొత్తంగా ఐరోపాలో 5,03066 కేసులు నమోదవగా, 33వేల మంది మరణించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికంటే ఎక్కువ.


logo