శనివారం 06 జూన్ 2020
International - Apr 27, 2020 , 15:12:55

జర్మనీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

జర్మనీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు!

బెర్లిన్‌: జర్మనీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 1,018 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 155,193కు పెరిగింది. సోమవారం మరో 110 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 5,750కు చేరుకున్నది. 

ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, యూకే దేశాల్లో  మృతుల సంఖ్య 20వేలు దాటినప్పటికీ జర్మనీలో మరణాల రేటు తక్కువగా ఉండటం గమనార్హం.  లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో పలువురు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. బెర్లిన్‌లో ఎమర్జెన్సీ విధించడంతో 20కి మించి జనం గుమిగూడకూడదని, నిరసనలకు అనుమతిలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


logo