శనివారం 06 జూన్ 2020
International - Apr 24, 2020 , 15:28:07

జర్మనీలో 1,50,383 కరోనా కేసులు

జర్మనీలో 1,50,383 కరోనా కేసులు

బెర్లిన్‌: జర్మనీలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టినా  కొత్తగా  వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా జర్మనీలో కరోనా కేసుల సంఖ్య లక్షా యాభైవేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 2,337 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 150,383కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 227 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య  5,321కు చేరింది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో బెర్లిన్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను  సైనికులు 1,000 పడకల హాస్పిటల్స్‌గా మారుస్తున్నారు. ఈ వారంలో ఇన్ఫెక్షన్‌ రేట్‌ రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. 


logo