మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 01, 2020 , 09:40:00

కరోనా ఎఫెక్ట్ : ఆ దేశ జీడీపీ దారుణంగా పడిపోయింది...

కరోనా ఎఫెక్ట్ : ఆ దేశ జీడీపీ దారుణంగా పడిపోయింది...

హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో మునిగి పోయ్యాయి. కొన్నాళ్ల క్రితం చైనా ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకున్నట్లు కనిపించింది. రెండో క్వార్టర్‌లో అంచనాలకు మించి వృద్ధిని సాధించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కాస్త శుభవార్త చెప్పింది. కానీ కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా పడిపోతున్నాయి. జర్మనీ ఆర్ధిక వ్యవస్థ యూరప్‌లోనే అతి పెద్దది. జర్మన్ వృద్ధి రేటు రెండో క్వార్టర్‌లో దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. ఎగుమతులు, దిగుమతులు భారీగా పడిపోయాయని, గృహ వినియోగం తగ్గిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జర్మనీ జీడీపీ రెండో క్వార్టర్‌లో అంచనాల కంటే ఎక్కువగా పడిపోయింది.

ఆర్థికవేత్తలు 9 శాతం క్షీణతను అంచనా వేశారు. కానీ 10.1 శాతం ప్రతికూలత నమోదు చేసింది. వృద్ధి దారుణంగా పడిపోవడంతో జర్మనీ స్టాక్ మార్కెట్లో డాక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 1 శాతానికి పైగా పడిపోయింది. యూరోపియన్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఫ్రాన్స్ CAC 0.5 శాతం, ఇటలీ FTSE MiB 0.9 శాతం, స్పెయిన్ Ibex 1.6 శాతం నష్టపోయాయి. ఫెడరల్ లేబర్ ఆఫీస్ డేటా ప్రకారం జర్మనీలో నిరుద్యోగిత రేటు జూలై నెలలో 6.4 శాతంగా ఉన్నది. జర్మనీ పదేండ్ల ఆర్థిక వ్యవస్థ తుడిచిపెట్టుకుపోయినట్లు దేనా బ్యాంకు ఎకనమిస్ట్ ఆండ్రేస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాల క్రితం క్వార్టర్ జీడీపీ ప్రారంభమైనప్పటి నుంచి దారుణ పతనం ఇదే అంటున్నారు విశ్లేషకులు. 2009లో నాలుగో త్రైమాసికం‌లో మైనస్ 4.7 శాతానికి మించి ప్రతికూలత నమోదు చేసిందని వారు చెబుతున్నారు.logo