శనివారం 30 మే 2020
International - May 22, 2020 , 13:56:14

చైనా నుంచి తరలిస్తున్న షూ బ్రాండ్లు! భారత్‌లోనే..

చైనా నుంచి తరలిస్తున్న షూ బ్రాండ్లు! భారత్‌లోనే..

కొవిడ్‌-19 వైరస్‌తో చైనా పేరు మారుమోగిపోయింది. స్కూల్‌కి వెళ్లని పసిపిల్లలతో సహా.. కరోనా, చైనా ఇంటి ఆడపడుచు అంటున్నారు. చైనా ప్రాడక్ట్స్‌ అంటేనే నో గ్యారెంటీ అనే పేరుంది. ఇప్పుడీ కరోనా దెబ్బకి చైనాలో స్టార్ట్‌ చేసిన అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ భారత్‌కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మన్ ఫుట్‌‌వేర్ బ్రాండ్ వోన్ వెల్‌‌ఎక్స్‌‌ ఓనర్ కాస ఎవర్జ్‌‌ తన బూట్ల తయారీని చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నట్టు ప్రకటించింది.

దాదాపు 80 దేశాల్లో అమ్మకాలు జరుపుతున్న ఈ కంపెనీ ముందుగా భారత్‌లోని ఆగ్రాలో రూ. 110 కోట్ల పెట్టుబడితో మొదలుపెట్టనున్నది. దీని ద్వారా ఏడాదికి 30 లక్షల జతల బూట్లు తయారు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నది. ఇది ఒకటే కాకుండా లైసెన్సీ లాట్రిక్‌ ఇండస్ట్రీస్‌ ఫ్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీతో కలిసి తయారు చేస్తున్నట్లు పేర్కొన్నది.


logo