బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 02:05:34

కీలకదశలో వ్యాక్సిన్‌

కీలకదశలో వ్యాక్సిన్‌

  • ఈ ఏడాది చివరినాటికి 10 కోట్ల మందికి
  • అమెరికా, జర్మనీ కంపెనీల ప్రకటన

వాషింగ్టన్‌: ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జర్మనీ కంపెనీ బయోఎన్‌టెక్‌, అమెరికా కంపెనీ ఫైజర్‌ ప్రకటించాయి. తమ వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలపై ప్రపంచవ్యాప్తంగా చివరి (కీలక)దశ అధ్యయనం జరుగుతున్నదని సోమవారం ప్రకటించాయి. ఈ అధ్యయనం సత్ఫలితాలు ఇస్తే అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌ విక్రయం కోసం ప్రభుత్వాలకు దరఖాస్తు చేస్తామన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 120 చోట్ల 30,000 మంది వలంటీర్లపై ఈ సంస్థలు అధ్యయనం నిర్వహిస్తున్నాయి. ‘కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటానికి శక్తిమంతమైన వ్యాక్సిన్‌ తయారీలో కీలకమైన 2,3 దశల ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి’ అని ఫైజర్‌ వ్యాక్సిన్‌ రీసెర్చ్‌ హెడ్‌ కత్రిన్‌ జాన్సెన్‌ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు అమెరికా ప్రభుత్వంతో ఈ సంస్థ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.vvvv


logo