సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 14:19:59

ప్రపంచంలోనే మొదటి వేగవంతమైన కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను లాంచ్‌ చేసిన జెన్‌స్క్రిప్ట్‌

ప్రపంచంలోనే మొదటి వేగవంతమైన కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను లాంచ్‌ చేసిన జెన్‌స్క్రిప్ట్‌

న్యూ ఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌ను ప్రముఖ గ్లోబల్‌ బయోటెక్నాలజీ సంస్థ జెన్‌స్క్రిప్ట్ భారత మార్కెట్‌లోకి‌ లాంచ్‌ చేసింది. ఇందుకోసం ప్రేమాస్ లైఫ్ సైన్సెస్‌తో జతకట్టింది. సీ పాస్‌ సార్స్‌ సీవోవీ-2 న్యూట్రలైజేషన్‌ యాంటీబాడీ డిటెక్షన్‌ కిట్‌గా పిలిచే దీనిని  సింగపూర్ ఏజెన్సీ ఫర్ సైన్స్  టెక్నాలజీ అండ్ రీసెర్చ్ నుంచి డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ సింగపూర్, డయాగ్నోస్టిక్స్ డెవలప్‌మెంట్ హబ్‌తో కలిసి అభివృద్ధి చేశారు.

దీనిని జెన్‌స్క్రిప్ట్ బయోటెక్ కార్పొరేషన్‌ తయారుచేస్తుంది. ఇది ప్రపంచంలోని మొదటి వేగవంతమైన పరీక్షా కిట్. ఇది ఒక గంటలోపు తటస్థీకరించే ప్రతిరోధకాలను కొలవగలదు. ఇది ప్రస్తుత కొవిడ్‌-19 పరిశోధనలు, సెరో-ప్రాబల్యెన్స్ సర్వే, హెర్డ్‌ ఇమ్యూనిటీపై పరిశోధన, దీర్ఘాయువు తటస్థీకరించే ప్రతిరోధకాలు, టీకా వేయించుకునే అభ్యర్థుల సామర్థ్యాన్ని రక్షించడంలాంటి వాటికి ఊతంగా నిలుస్తుంది. సాంప్రదాయిక లైవ్ వైరస్ పరీక్షా కిట్‌ల మాదిరిగా కాకుండా గ్లోబల్ కమ్యూనిటీ సీపాస్‌ను ఉపయోగించగలదు. దీని పరీక్ష కోసం జీవ భద్రత అవసరం లేదు. ఈ పరీక్ష టీకా, చికిత్సా అభివృద్ధికి కీలకమైనది. ఇది అన్ని యాంటీబాడీ ఐసోటైప్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి మార్పు లేకుండా వివిధ జంతు నమూనాలలో ప్రతిరోధకాలను నిర్ణయించడానికి ఉపయోగించవచ్చని జెన్‌స్క్రిప్ట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.  


logo