శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 11:05:28

బంగ్లాదేశ్‌లో పేలుళ్లు : 11 మంది మృతి

బంగ్లాదేశ్‌లో పేలుళ్లు : 11 మంది మృతి

ఢాకా : బ‌ంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాలో ఓ గ్యాస్ పైప్‌లైన్ పేలిపోయింది. నారాయ‌ణ‌గంజ్‌లోని బైతుస్ స‌లాత్ జామే మ‌సీదు వ‌ద్ద ఉన్న గ్యాస్ పైప్‌లైన్ శుక్ర‌వారం రాత్రి పేలిన‌ట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి మ‌సీదులోని ఆరు ఏసీలు కూడా పేలిపోయాయి. ఈ పేలుళ్ల‌లో 37 మంది ముస్లింలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో చికిత్స పొందుతూ 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక బాలుడు ఉన్నాడు. మ‌సీదులో ప్రార్థ‌న‌లు ముగించుకుని బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా పేలుళ్లు సంభ‌వించాయి. ప్ర‌మాద‌స్థ‌లిలో పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డ్డ వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.


logo