బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 23, 2020 , 15:38:40

తోటలో పండిన ఆలుగడ్డ.. అచ్చం ఆ ఇంటి కుక్కలాగే ఉంది..!

తోటలో పండిన ఆలుగడ్డ.. అచ్చం ఆ ఇంటి కుక్కలాగే ఉంది..!

లండన్‌: ఒక్కోసారి పండ్లు, కూరగాయలు.. పాములు, వినాయకుడు, ఇతర ఆకారాల్లో కనిపిస్తుంటాయి. ఇవి ప్రత్యేకతను సంతరించుకుంటాయి. కానీ, లండన్‌లో ఓ విచిత్రం జరిగింది. ఓ ఇంటి యజమానురాలు తన తోటలో ఆలుగడ్డలు సాగుచేసింది. ఇటీవల తవ్విచూడగా, ఒక ఆలుగడ్డ అచ్చం తన ఇంటి కుక్కపిల్ల ముఖంలాగే కనిపించేసరికి ఆమె అవాక్కయింది. ఈ ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టగా వైరల్‌ అయ్యింది.    

యూకేకు చెందిన జోవాన్ గుడ్జర్‌ తోటలో కనిపించింది ఈ ఆశ్చర్యకరమైన ఆలుగడ్డ. ఇది అచ్చం తన 13 ఏళ్ల అమెరికన్ బుల్డాగ్ లాగే ఉందని ఆమె తెలిపింది. ఈ బంగాళదుంప ఫొటోను వెంటనే తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపించింది. అలాగే, ఆలుగడ్డ పక్కకు తన కుక్క డేవ్‌ను ఉంచి ఫొటో తీసింది. దీనిని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వేలసంఖ్యలో లైక్‌లు వచ్చాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo