శనివారం 30 మే 2020
International - Apr 18, 2020 , 11:09:50

బీచ్ లా గార్డెన్..ఫ్యామిలీ అంతా స‌ర‌దాగా..వీడియో

బీచ్ లా గార్డెన్..ఫ్యామిలీ అంతా స‌ర‌దాగా..వీడియో

యూకేలో క‌రోనా ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌తీ ఒక్క‌రూ లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఇంటిలోప‌ల‌ మ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా మార్పులు చేసుకుంటే లాక్ డౌన్ స‌మ‌యాన్ని ఎంజాయ్ చేయొచ్చు. యూకేలోని బ్రిస్ట‌ల్ లో ఓ ఫ్యామిలీ ఇలాంటి స‌మ‌యంలో స‌ర‌దాగా గ‌డిపేందుకు త‌మ ఇంటి ఆవ‌ర‌ణ‌లోని గార్డెన్ లో రెడీమేడ్ బీచ్ లా మార్చారు. 

ఇంటి స‌మీపంలో ఉన్న‌గ్యారేజీలో ఇసుక ఉన్న‌ట్లు అమీ వూల్ల‌న్ (22) యువ‌తి నాన్న గుర్తించాడు. దీంతో అమీకి రెడీమేడ్ బీచ్ ఆలోచ‌న వ‌చ్చింది. బీచ్ ఇసుక‌తెన్నెల‌పై కుర్చీలెలా ఉంటాయో..అలా అంతా డిజైన్ చేసుకున్నారు. కొంత ప్ర‌దేశాన్ని ఇసుక‌తో నింపేశారు. ఇంకేముంది కుటుంబ‌సభ్యులంతా స్విమ్ సూట్స్ ధ‌రించారు. కొంద‌రు కుర్చీల‌పై కూర్చొని కాక్ టెయిల్ తాగుతుంటే..మిగిలిన వారు నీళ్ల‌లో దూకుతున్నారు. క్వారంటైన్ కోసం సిద్ధం చేసిన బీచ్ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo