మంగళవారం 26 జనవరి 2021
International - Jan 09, 2021 , 12:51:29

ఇండియాకు తిరిగొచ్చిన మహాత్ముడు

ఇండియాకు తిరిగొచ్చిన మహాత్ముడు

1915 జనవరి 9.. ఉదయం 7 గంటల సమయం.. బొంబాయి (ప్రస్తుతం ముంబై) అపోలో నౌకాశ్రయం.. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇంతలో పడవలో నుంచి భారత గడ్డపై తిరిగి కాలుపెట్టారు మహాత్మాగాంధీ.. ఇదే మన దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టేందుకు చివరి పిలుపు అవుతుందని ఆనాడు ఎవరూ ఆనుకోలేదు. ఇది జరిగి నేటికి సరిగ్గా 105 సంవత్సరాలు. కరంచంద్‌ గాంధీ 1893 లో దక్షిణాఫ్రికాకు వెళ్లి.. 45 ఏండ్ల వయసులో అనుభవజ్ఞుడైన న్యాయవాదిగా తిరిగివచ్చారు. భారతదేశం చాలా కష్టమైన కాలంలో ప్రయాణిస్తున్న సమయంలో గాంధీ తిరిగి వచ్చారు. 1905 లో బెంగాల్‌ను రెండు ముక్కలుగా చేశారు. 1911 లో భారత రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చబడింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తియానా.. అప్పటివరకు స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించలేదు. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన రెండేండ్ల తరువాత బిహార్లోని చంపారన్ నుంచి స్వాతంత్ర్య పోరాటం కోసం సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అనంతర కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిలు తేవడం వల్ల వారు భారత్‌కు స్వాతంత్ర్యం అందించారు. గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చిన ఈ రోజును పురస్కరించుకుని ఏటా జనవరి 9 న ప్రవాసీ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

అంటార్కిటికా చేరుకున్న తొలి భారత బృందం


పూర్తిగా మంచుతో కూడిన అంటార్కిటికా ఖండంలో భారత్‌కు చెందిన పరిశోధకుల బృందం 1981 లో పర్యటించింది. డాక్టర్ సయ్యద్ జహూర్ ఖాసిమ్ నేతృత్వంలోని జట్టులో మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. ఖాసిమ్ అప్పుడు పర్యావరణ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ఈ మిషన్ యొక్క లక్ష్యం అంటార్కిటాలో శాస్త్రీయ పరిశోధనలు చేయడమే. ఈ బృందం 1981 డిసెంబర్ 6 న గోవా నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించి.. 1982 ఫిబ్రవరి 21 న అంటార్కిటిక నుంచి గోవాకు తిరిగి వచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన ఘటనలు:

2012: వరుసగా రెండో ఏడాది ఫిఫా బాలన్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్న లియోనెల్ మెస్సీ.

2002: అమెరికన్ జాక్సన్ అవార్డులో మైఖేల్ జాక్సన్‌కు ఆర్టిస్ట్ ఆఫ్ ది సెంచరీ లభించింది.

1970: సింగపూర్‌లో రాజ్యాంగం ఆమోదించబడింది.

1941: రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో ఆరు వేల మంది యూదుల హత్య.

1873: యూరోపియన్ పాలకుడు నెపోలియన్ బోనపార్టే III మరణం.

1811: ప్రపంచంలో మొదటిసారి మహిళల గోల్ఫ్ టోర్నమెంట్ జరిగింది.

1793: ప్రపంచంలోని మొట్టమొదటి వేడి గాలి బెలూన్ అమెరికాలోని ఫిలడెల్ఫియాలోకి వెళ్లింది.

1768: ఫిలిప్ ఆస్టెల్ మొదటి 'మోడరన్ సర్కస్' ప్రదర్శించాడు.

1718: ఫ్రాన్స్ స్పెయిన్‌పై యుద్ధం ప్రకటించింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌, నమస్తే తెలింగాణ


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo