బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 11:39:09

గేదెను త‌న్నాడు.. త‌గిన శాస్తి జ‌రిగింది!

గేదెను త‌న్నాడు.. త‌గిన శాస్తి జ‌రిగింది!

ఇత‌రుల‌కు హాని చేయాల‌ని చూస్తే మ‌న‌కే చెడు జ‌రుగుతుంది. అభం సుభం తెలియ‌ని మూగ‌జీవాల‌ను హింసిస్తే వారికి త‌గిన శాస్తి జ‌ర‌గ‌డం ఖాయం అని ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. పాపం గేదెలు రోడ్డు దాటుతూ ఉన్నాయి. వెనుక నుంచి బైక్ మీద వెళ్తున్న ఇద్ద‌రు ఆక‌తాయిలు అందులో ఒక గేదెను ఆట‌ప‌ట్టిద్దాం అనుకున్నారు. బైక్ న‌డిపేవాడు కొంచెం ప‌ద్ద‌తిగానే న‌డుపుతున్నా వెనుక కూర్చున్న పోకిరి మాత్రం కుడికాలుతో గేదెను గ‌ట్టిగా త‌న్నాడు. ఆ బ‌లానికి బైక్ అదుపుత‌ప్పింది. ఇంకేముంది బైక్ మీదున్న‌ ఇద్ద‌రు అక్కడిక‌క్క‌డే ప‌డ్డారు. గేదెకు మాత్రం ఏమీ కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. గేదెను త‌న్నిన కుర్రాళ్ల‌కు తిక్క కుదిరిందిలే అని న‌వ్వుకుంటున్నారు. మ‌రి వీడియో చూశాక మీరేం అంటారు?


logo