గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 13:13:27

ఈ కార్ల‌న్నింటికీ ఏమైంది.. కొంప‌తీసి దెయ్యంగాని ప‌ట్ట‌లేదుగా?

ఈ కార్ల‌న్నింటికీ ఏమైంది.. కొంప‌తీసి దెయ్యంగాని ప‌ట్ట‌లేదుగా?

కారులో దెయ్యం ఉన్న సినిమాలు చాలానే చూశాం. కారులోకి మ‌నిషి ఆత్మ ప్ర‌వేశించి ఎప్ప‌టికైనా ప‌గ నెర‌వేర్చుకుంటుంది. ఇలాంటి క‌థ‌తో సాగే సినిమాలు చూశాం కానీ, ఈ వీడియో చూస్తే నిజంగానే కార్ల‌కు దెయ్యం ప‌డుతుంది అనుకోవ‌డం మాత్రం ఖాయం. అప్ప‌టి వ‌ర‌కు బాగున్న కారు ఉన్న‌ట్టుండి ఈ విధంగా చేస్తే ఎవ‌రైనా అలానే అనుకుంటారు.

ఒక‌టి కాదు రెండు కాదు చాలా కార్లు ఇలానే చేస్తున్నాయి. అన్ని కార్ల‌ను క‌లిపి ఒక వీడియోగా చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఇది వైర‌ల్ అయింది. ఈ వీడియో చూసిన త‌ర్వా త ఆశ్చ‌ర్యంతో ముక్కు మీద‌ వేలు వేసుకోవ‌డం ఖాయం. వీడియో చూసే కొద్ది న‌వ్వు కూడా వ‌స్తుంది. 2 నిమిషాల‌కు పైగా న‌డిచే ఈ వీడియోలో మ‌రి దెయ్యం ఉందో లేదో మీరే చెప్పాలి.


logo