బుధవారం 24 ఫిబ్రవరి 2021
International - Jan 21, 2021 , 19:22:43

ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు

ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు

అవుట్‌ గోయింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా వైట్ హౌస్ నుంచి బయలుదేరిన తరువాత ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలోని తన రిసార్ట్‌కు చేరుకున్నారు. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరవకుండా వైట్ హౌస్‌ను వీడి వెళ్లిపోవడం పట్ల నెటిజెన్లు ట్రంప్‌ను విపరీతంగా ఆడుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో మీమ్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరవడం ట్రంప్, ఆయన భార్య మెలానియా తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది, కానీ పూర్తిగా ఊహించనిది మాత్రం కాదు. 152 సంవత్సరాల పురాతన సంప్రదాయాన్ని ఆపహాస్యం చేస్తూ ట్రంప్‌ వైట్‌ హైస్‌ నుంచి నిష్క్రమించారు. 1869 నుండి కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిరాకరించిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్. అయితే మెలానియా కూడా బైడెన్‌ సతీమణి డాక్టర్‌ జిల్‌ బైడెన్‌ను వైట్ హౌస్ పర్యటనకు ఆహ్వానించకపోవడం ద్వారా చాలా మందిని ఆశ్చర్యపరిచారు. అధ్యక్షుడు బైడెన్ ఇనాగురేషన్‌ కార్యక్రమానికి ఇవాంకా ట్రంప్‌తోపాటు ట్రంప్ కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా హాజరుకాలేదు.

వైట్ హౌస్ నుంచి బయలుదేరిన ట్రంప్స్‌పై సోషల్‌ మీడియాలో లెక్కకు మిక్కిలి మీమ్స్, జోకులు ఎన్నో ట్రెండ్ అయ్యాయి. పాప్ స్టార్ రిహన్న మాత్రం ట్రంప్‌ నిష్క్రమణను సూటిగా విమర్శించారు. చెత్తను తీసుకెళ్తున్న ఫొటోను పోస్ట్ చేసి దానికి "నేను సహాయం చేయడం కోసం ఇక్కడ ఉన్నాను" అని శీర్షిక పెట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బైడెన్‌కు ఫోన్‌ చేసి కమలా హ్యారిస్‌ చెప్పిన #WeDidItJoe - అనే హ్యాష్‌ట్యాగ్ ను కూడా జతచేసింది.

VIDEOS

logo