బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 03:42:51

మరణం ప్రత్యక్ష ప్రసారం!

మరణం  ప్రత్యక్ష ప్రసారం!

ఫ్రాన్స్‌: ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన మరణాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయాలనుకుంటున్నాడు. నిజం. అలేన్‌ కోక్క్‌(57) అనే వ్యక్తి చికిత్సకు లొంగని వ్యాధితో గతకొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ బాధను భరించలేని అతను.. తనకు నొప్పి కలుగకుండా మరణం ప్రసాదించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌కు లేఖ రాశాడు. అయితే దీనికి ఫ్రాన్స్‌ చట్టాలు అంగీకరించవని మెక్రాన్‌ ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. దీంతో నీళ్లు, ఆహారం తీసుకోవడం మానేశాడు. ఇంకా వారం రోజులు మాత్రమే బతుకుతానని నమ్ముతున్న కోక్క్‌.. తన మరణాన్ని ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో ప్రసారం చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నాడు. స్ట్రీమింగ్‌ శనివారం ఉదయం నుంచి ప్రారంభించనున్నట్టు వివరించాడు. 


logo