శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 05, 2020 , 16:34:43

ఈ రియల్‌ స్పైడర్‌మ్యాన్‌ ఫీట్‌ చూడాల్సిందే..వీడియో

ఈ రియల్‌ స్పైడర్‌మ్యాన్‌ ఫీట్‌ చూడాల్సిందే..వీడియో

స్పైడర్‌మ్యాన్‌ సినిమాలో టామ్‌ హోలాండ్‌ పెద్ద పెద్ద కట్టడాలపైకి జంప్‌ చేస్తూ.. రిస్కీ ఫీట్లు చేసి అందరిని అలరించిన విషయం తెలిసిందే. అయితే  ఇది రీల్‌లైఫ్‌లో కాబట్టి..ఫీట్స్‌ చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 475 అడుగుల ఎత్తైన టవర్‌ను ఎక్కి రియల్‌ స్పైడర్‌మ్యాన్‌ అంటే ఇలా ఉంటాడని నిరూపించాడు. ఫ్రెంచ్‌కు చెందిన క్లింబర్‌ (అధిరోహకుడు) ఎలైన్‌ రాబర్ట్‌ బార్సిలోనాలోని గ్లాస్‌తో డిజైన్‌ చేయబడ్డ టొర్రే అక్బర్‌ 145 మీటర్ల ఎత్తైన టవర్‌ ను అవలీలగా ఎక్కేశాడు. ఎలైన్‌ రాబర్ట్‌ ఎలాంటి రోప్స్‌కానీ ఇతర సపోర్ట్‌కానీ లేకుండా చేతులు, కాళ్లతో టొర్రే అక్బర్‌ టవర్‌ ఎక్కి ఔరా అనిపించాడు. కేవలం 25 నిమిషాల్లోనే టవర్‌పైకి చేరాడు రాబర్ట్‌. పైకి వెళ్లి కిందకి రావడానికి 47 నిమిషాలు పట్టింది. ప్రాణాలను రిస్క్‌ పెట్టి ఈ ఫీట్‌ చేసిన ఎలైన్‌ రాబర్ట్‌ను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే పోలీసులు మాత్రం ఎలైన్‌ రాబర్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు.   logo