ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 13:45:59

ఫ్రాన్స్ ప్ర‌ధాని రాజీనామా.. అంగీక‌రించిన అధ్య‌క్ష భ‌వ‌నం

ఫ్రాన్స్ ప్ర‌ధాని రాజీనామా.. అంగీక‌రించిన అధ్య‌క్ష భ‌వ‌నం

హైద‌రాబాద్‌: ఫ్రాన్స్ ప్ర‌ధాని ఎడువార్డ్ ఫిలిప్ రాజీనామా చేశారు.  అధ్య‌క్ష భ‌వ‌నం ఎలిసీ ప్యాలెస్ ఈ విష‌యాన్ని ద్రువీక‌రించింది. అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్‌కు రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. ప్ర‌ధాని రాజీనామాను అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ప్ర‌భుత్వ స‌భ్యుల‌తో.. కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటు వ‌ర‌కు ప‌రిపాల‌న చేయ‌నున్న‌ట్లు అధ్య‌క్ష భ‌వ‌నం ఇవాళ‌ ఓ లేఖ‌లో పేర్కొన్న‌ది.  2017 నుంచి ఫిలిప్‌.. ఫ్రాన్స్ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.  గ‌త వారం క్రితం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో.. లీ హార్వే నుంచి ఫిలిప్ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు.  గ‌తంలోనూ ఇదే పోర్టు న‌గ‌రం నుంచి ఫిలిప్ మేయ‌ర్‌గా చేశారు.  ప్ర‌ధాని ఫిలిప్ రాజీనామాతో ఫ్రాన్స్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మార‌నున్నాయి.


logo