శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 17, 2020 , 15:21:28

ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్ర‌న్‌కు కోవిడ్ పాజిటివ్‌..

ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్ర‌న్‌కు కోవిడ్ పాజిటివ్‌..

హైద‌రాబాద్‌:  యూరోప్‌లో నోవెల్ క‌రోనా వైర‌స్ రెండో ద‌ఫా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉన్న‌ది. అయితే ఫ్రాన్స్ దేశాధ్య‌క్షుడు ఎమ్మాన్యువెల్ మాక్ర‌న్‌.. కోవిడ్‌19 ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.  ఈ విష‌యాన్ని అధ్య‌క్ష భ‌వ‌నం ఎలిసీ ప్యాలెస్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. అద్య‌క్షుడు మాక్ర‌న్ ఏడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్ల‌నున్నారు.  అధ్య‌క్ష భ‌వ‌నం నుంచే ఆయ‌న త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నున్నారు.  తొలి ల‌క్ష‌ణ క‌నిపించ‌గానే.. అధ్యక్షుడు మాక్ర‌న్ వైర‌స్ ప‌రీక్ష చేయించుకున్న‌ట్లు ప్యాలెస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మాక్ర‌న్‌కు ఎటువంటి ల‌క్ష‌ణాలు డెవ‌ల‌ప్ అయ్యాయో అధ్య‌క్ష భ‌వ‌నం ప్ర‌క‌టించ‌లేదు. ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష ఆధారంగా మాక్ర‌న్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు గుర్తించారు.   


logo