శనివారం 30 మే 2020
International - May 05, 2020 , 09:42:33

డిసెంబ‌ర్‌లోనే ఫ్రాన్స్‌లో క‌రోనా కేసులు..

డిసెంబ‌ర్‌లోనే ఫ్రాన్స్‌లో క‌రోనా కేసులు..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ కేసులు గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లోనే ఫ్రాన్స్‌లో న‌మోదు అయిన‌ట్లు డాక్ట‌ర్ కోహెన్ తెలిపారు.  గ‌త ఏడాది డిసెంబ‌ర్ 27వ తేదీన ఓ కేసును ప‌రిశీలించిన ఆయ‌న‌.. ఓ పేషెంట్‌కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అంటే క‌రోనా కేసులు గుర్తించ‌డానికి కొన్ని వారాల ముందే ఫ్రాన్స్‌లో క‌నిపించిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 24వ తేదీన మూడు క‌రోనా కేసుల‌ను ఫ్రాన్స్‌లో గుర్తించారు.  కానీ డాక్ట‌ర్ కోహెన్ మాత్రం వైర‌స్ కేసుల‌ను ముందే గుర్తించిన‌ట్లు చెబుతున్నారు.  పారిస్‌లోని ఏవిసెన్ని, జీన్ వెర్‌డైర్ హాస్పిట‌ళ్ల‌లో పేషెంట్ల‌కు ఫ్లూ లాంటి ల‌క్ష‌ణాల‌ను గ‌త డిసెంబ‌ర్‌లోనే గుర్తించిన‌ట్లు డాక్ట‌ర్ కోహెన్ చెప్పారు. 14 మంది రోగుల‌కు ప‌రీక్ష చేప‌ట్ట‌గా, ఒక‌రిలో క‌రోనా వైర‌స్‌ను గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. ఎటువంటి పొర‌పాటు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌రీక్ష‌లు చేప‌ట్టామ‌న్నారు. రెండు సార్లు కూడా పాజిటివ్ తేలిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

 


logo