బుధవారం 03 జూన్ 2020
International - May 22, 2020 , 12:06:01

ఇది ఉంటే రెస్టారెంట్‌కి ధైర్యంగా వెళ్లొచ్చు!

ఇది ఉంటే రెస్టారెంట్‌కి ధైర్యంగా వెళ్లొచ్చు!

కొవిడ్‌-19 దెబ్బకి ప్రపంచమంతా గడగడలాడిపోయింది. ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో స్కూల్స్‌, షాపులు తెరుచుకున్నాయి. కానీ రెస్టారెంట్లు, మాల్స్‌కి మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఆఫ్టర్‌ లాక్‌డౌన్‌ రెస్టారెంట్లకి ప్రజలు ధైర్యంగా వచ్చేలా వినూత్న పరికరం తయారు చేశాడు ఓ డిజైనర్‌. ఇది ఉంటే చాలు ధైర్యంగా రావొచ్చు అంటున్నాడు.

రెస్టారెంట్లలో మాస్క్‌ ధరించి తినడం ఖష్టం. అందుకని టేబుల్స్‌ను దూరం దూరంగా వేయాలి. దీంతో యజమానులకు భారీ మొత్తంలోనే ఖర్చవుతుంది. అందుకని పారదరర్శక ప్లాస్టిక్‌ సిలిండర్‌ను సృష్టించాడు ఫ్రెంచ్‌కు చెందిన డిజైనర్‌. ఇది చూడ్డానికి టేబుల్‌పై నుంచి పైకప్పు వేలాడుతున్నట్లు ఉంటుంది. అంతేకాదు లాంప్‌షేడ్‌లా కనిపిస్తుంది. దీనిలోపల కూర్చొని హ్యాపీగా తినొచ్చు. వెనుక భాగాన ఆనుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. దీని పేరు ‘ప్లెక్స్‌ ఈట్‌’గా నామకరణం చేశాడు డిజైనర్ క్రిస్టోఫ్‌ జెర్నాగాన్‌. ఆఫ్టర్‌ లాక్‌డౌన్‌ ప్రజలు ధైర్యంగా రెస్టారెంట్లకు రావడానికి మరింత సౌకర్యాలు కల్సిస్తానంటున్నాడు. వచ్చేవారం నుంచి దీని ఉత్పత్తి మొదలవుతుంది. ఫ్రాన్స్‌, బెల్జియం, కెనడా, జపాన్‌, అర్జెంటీనా నుంచి ఆర్డర్లు వస్తున్నాయని కూడా చెబుతున్నాడు.


 


logo