మంగళవారం 19 జనవరి 2021
International - Dec 19, 2020 , 21:35:31

సండే ‘బ్రెగ్జిట్‌’ డీల్‌కు ఫ్రాన్స్‌ నో... టైం తీసుకోవాల్సిందే

సండే ‘బ్రెగ్జిట్‌’ డీల్‌కు ఫ్రాన్స్‌ నో... టైం తీసుకోవాల్సిందే

పారిస్‌:  యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ప్రతిపాదించిన సండే ‘బ్రెగ్జిట్‌’ డీల్‌కు ఒప్పుకోబోమని ఫ్రాన్స్‌ యూరోపియన్‌ వ్యవహారాల మంత్రి క్లెమెంట్‌ బియానె పేర్కొన్నారు. ఈయూ హయాంలోనే అతిపెద్దదైన చారిత్రక ఒప్పందంగా బ్రెగ్జిట్‌ నిలిచిపోనున్నది. ఇటువంటి ఒప్పందంపై ఏళ్ల తరబడి చర్చల తరువాత అంగీకారానికి రావాల్సి ఉంటుందని ఫ్రాన్స్‌ ఇంటర్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రెగ్జిట్‌ ఒప్పందంపై అంగీకారానికి రావాలంటే మరింత సమయం అవసరం అని వెల్లడించారు. 

 ఒత్తిళ్లతో కూడిన డెడ్‌లైన్‌ కింద చర్చలు జరుపడం ఫలప్రదం కాబోదని క్లెమెంట్‌ బియానె చెప్పారు. క్యాలెండర్‌ ఆఫ్‌ ప్రెషర్‌ పరిధిలో తమ ప్రయోజనాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇప్పటికీ పలు సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. కాంపిటీషన్‌ కండీషన్లపై తాము ఆందోళన చెందుతున్నట్లు క్లెమెంట్‌ పేర్కొన్నారు. ఈయూ మార్కెట్‌లోకి అడుగు పెట్టేందుకు బ్రిటన్‌ కంపెనీలను అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఈయూయేతర సభ్య దేశంగా బ్రిటన్‌.. ఈయూ కంపెనీలను అనుమతిస్తే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.