బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 09:56:39

కరోనా నియంత్రణకు భారత్‌కు ఫ్రాన్స్‌ చేయూత

కరోనా నియంత్రణకు భారత్‌కు ఫ్రాన్స్‌ చేయూత

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్ర చర్యల్లో భాతర్‌కు ఫ్రాన్స్‌ చేయూతనిచ్చింది. దీనిలో భాగంగా కరోనా పరీక్షలకు అవసరమైన కీట్లు, వెంటిలేటర్లు, ఇతర కరోనా పరీక్షల సామగ్రిని భారత్‌కు అందజేసింది. ఓ ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌ నుంచి కరోనా పరీక్షల సామగ్రి భారత్‌కు చేరుకున్నాయి. ఈ ప్రత్యేక విమానం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగింది.

భారత్‌లోని ప్రాన్స్‌ రాయబారి ఇమ్యానుయేల్‌ లీనెయిన్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కార్యదర్శి ఆర్కే జైన్‌కు ఈ సామాగ్రిని అందజేశారు. వీటిలో 50,000 సిరలాజికల్‌ పరీక్ష కిట్లు, 50,000 ముక్కు, గొంతు స్వాబ్‌లు, 120 వెంటిలేర్లు ఇతర పరికరాలు ఉన్నాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo