గురువారం 28 మే 2020
International - Apr 18, 2020 , 16:43:36

కరోనా కల్లోలం: భారత్ పేదలకు ఫ్రాన్స్ సాయం

కరోనా కల్లోలం: భారత్ పేదలకు ఫ్రాన్స్ సాయం

హైదరాబాద్: కరోనా కల్లోల మధ్యలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అత్యంత నిరుపేద వర్గాలకు సహాయం అందించేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. గత మార్చి 31న ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన సుదీర్ఘమైన టెలిఫోన్ సంభాషణలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రతిపాదన చేశారు. ఫ్రాన్స్ రాయబారి ఇమాన్యుయేల్ లెనాయిన్ శనివారం ఈ సంగతి వెల్లడించారు. భారత్‌లోని నిరుపేదల కోసం కరోనా నేపథ్యంలో ప్రత్యేక సాయం అందిస్తానని మాక్రాన్ చెప్పారని ఆయన తెలిపారు. ఏప్రిల్ చివరలో ఈ సహాయ కార్యక్రమం వివరాలు వెల్లడి అవుతాయని తెలుస్తున్నది. కరోనా కల్లోలం మొదలైన నాటినుంచి రెండు దేశాల రాజకీయా నాయకత్వం సన్నిహితంగా పనిచేస్తున్నదని రాయబారి లెనాయిన్ అన్నారు. గడ్డురోజుల్లోనే మన భాగస్వామ్యం పూర్తిస్థాయిలో ప్రాముఖ్యం సంతరించుకుంటుందని పేర్కొన్నారు. భారత్‌లో చిక్కువడ్డ ఫ్రెంచ్ పౌరులను వెనుకకు పంపించడంలో భారత్ ప్రబుత్వం చేసిన సహాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇప్పటివరకు 48 దేశాలకు చెందిన సుమారు 35 వేలమంది తమతమ దేశాలకు తిరిగి వెళ్లేలా భారత్ తోడ్పాటు అందించింది. అంతేకాకుండా భారత్ యాంటీమలేరియా మందు సరఫరా చేసిన 50 దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది.


logo