పారిస్: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు ఫ్రాన్స్ భారీ జరిమానా విధించింది. గూగుల్ తమ వార్తలను వాడుకొన్నందుకు నగదు చెల్లించాలని ఫ్రెంచ్ ప్రచురణకర్తలు, వార్తా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంలో గూగుల్ 500 మిలియన్ యూరోల (రూ.4,400 కోట్లు) జరిమానా చెల్లించాలని ఫ్రాన్స్ ఆదేశించింది. ఈ నిర్ణయం నిరాశకు గురిచేసిందని గూగుల్ తెలిపింది.