సోమవారం 01 జూన్ 2020
International - Apr 14, 2020 , 12:34:05

కరోనా లాక్‌డౌన్‌ను మరోనెల పొడిగించిన ఫ్రాన్స్

కరోనా లాక్‌డౌన్‌ను మరోనెల పొడిగించిన ఫ్రాన్స్

హైదరాబాద్: కరోనా కల్లోలంతో సతమతమవుతున్న ఫ్రాన్స్ లాక్‌డౌన్‌ను మరోనెల పాటు పొడిగించింది. మహమ్మారిని నిలువరించేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగించడమే ఏకైక మార్గమని ఫ్రాన్స్ ప్రభుత్వం భావిస్తున్నది. స్పెయిన్ తదితర దేశాలు లాక్‌డౌన్ ఉపసంహరించి సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాలని చూస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ మే 11 వరకు కచ్చితంగా లాక్‌డౌన్ అమలు చేయాలని చూస్తున్నది. మరణాల సంఖ్య గతవారంతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉన్నది. ఐసీయూ రోగుల సంఖ్య కూడా తగ్గుతున్నది. అయినా ఇప్పుడు పట్టు సడలిస్తే కరోనాను అదుపు చేయడం అసాధ్యమని ఫ్రాన్స్ భావిస్తున్నది. అప్పుడే నియంత్రణలు ఎత్తివేస్తే రెండో విడత కేసులు విజృంభిస్తాయని, టీకా కనిపెట్టేంత వరకు కరోనా నుంచి విముక్తి ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే.


logo