ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 15, 2020 , 19:48:19

కరోనా హైరిస్క్‌ జోన్లుగా పారీస్‌, మార్సెయిల్

కరోనా హైరిస్క్‌ జోన్లుగా పారీస్‌, మార్సెయిల్

పారీస్‌:  ఫ్రాన్స్‌లో క‌రోనా మహమ్మారి  క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా కేసుల‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న దేశ రాజధాని పారీస్‌,  రెండో అతిపెద్ద సిటీ  మార్సెయిల్‌ను ఫ్రెంచ్‌ ప్రభుత్వం హై-రిస్క్‌జోన్లుగా ప్రకటించింది.  ఈ రెండు నగరాల్లో   వైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. వరుసగా మూడో రోజూ కొత్తగా 2,500కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా విజృంభిస్తున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు తాజా ప్రకటన అధికారులకు వీలుకల్పిస్తుంది. 

కరోనా హైరిస్క్‌ జోన్లలో ప్రజా రవాణా, రద్దీని తగ్గించడం, రెస్టారెంట్లు, బార్లను మూసివేయడం   ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 2,12,211 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనా వల్ల 30,406 మంది చనిపోయారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 97,957 యాక్టివ్‌ కేసులున్నాయి. 


logo