శనివారం 06 జూన్ 2020
International - Apr 15, 2020 , 09:23:01

ఫ్రాన్స్‌లో 15వేలు.. ప్రపంచవ్యాప్తంగా లక్షా 20 వేలు

ఫ్రాన్స్‌లో 15వేలు.. ప్రపంచవ్యాప్తంగా లక్షా 20 వేలు

పారిస్‌: ఫ్రాన్స్‌లో మంగళవారం నాటికి కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 15 వేలకు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనాతో అత్యధికంగా మృతిచెందిన దేశాల్లో నాలుగో స్థానానికి చెరింది. 26 వేల మందితో అమెరికా మొదటిస్థానంలో ఉండగా, ఇటలీ (21,067), స్పెయిన్‌ (18,255) తర్వాత ఫ్రాన్స్‌ (15729) ఉన్నది. దేశంలో వైరస్‌ ప్రభావంతో 6821 మంది ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 762 మంది మరణించగా, మొత్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 1,03,573కు చేరింది.  

ప్రపంచవాప్తంగా కరోనా మృతుల సంఖ్య లక్షా 20 వేలకు చేరింది. ఇందులో 81,474 మంది యూరప్‌కు చెందినవారే ఉన్నారు. అంటే  70 శాతానికిపైగా అంటే ఐరోపాలో సంభవించినవే కావడం విశేషం.   


logo