సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 16:36:52

కంటికి కనబడని వైరస్‌తో ఆ రెండు దేశాలు యుద్ధం చేస్తున్నాయి

కంటికి కనబడని వైరస్‌తో ఆ రెండు దేశాలు యుద్ధం చేస్తున్నాయి

బెర్లిన్‌, పారిస్‌ : పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టడానికి ఫ్రాన్స్, జర్మన్ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. స్పెయిన్‌లో కరోనా కేసులు పెరుగడంతో తాజాగా ఫ్రాన్స్, జర్మనీ కూడా వైరస్‌ను అదుపు చేయడానికి కష్టపడుతున్నాయి. ఫ్రాన్స్‌లో శనివారం వరుసగా రెండో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మేలో లాక్‌డౌన్ సడలించినప్పటి నుంచి ఇక్కడ కేసుల పెరుగుదల ప్రారంభమైంది. ప్రస్తుతం 217,000కరోనా కేసులు నమోదు కాగా .. ఇప్పటి వరకు 30,000 మంది కరోనాతో మరణించారు. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన యూరప్‌ దేశాల్లో ఫ్రాన్స్‌ ఒకటి. 

16 హై-రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఆన్-ది-స్పాట్ పరీక్షలు చేయాల్సిందిగా ప్రధాని జీన్ కాస్టెక్స్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడంలో భాగంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. స్పెయిన్ ఈశాన్య ప్రాంతమైన కాటలోనియాకు వెళ్లొద్దని ఫ్రాన్స్ తన పౌరులకు సూచించింది.

ఇకపోతే జర్మనీలో శుక్రవారం కొత్తగా 815 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ మధ్య ఇక్కడ నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. శనివారం 781 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్, టర్కీ వంటి అధిక ప్రమాదం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ప్రభుత్వం అత్యవసర పరీక్షలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ డ్యూచ్‌ లాండ్‌ఫంక్ అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo