పారిస్ : సినిమాలకు వెళ్లాలన్నా.. నైట్‌క్లబ్‌కు వెళ్లాలన్నా.. ఇక నుంచి వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ తప్పనిసరి చేస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. కోవిడ్19పై పోరాటాన్ని ముమ్మరం చేసేందుకు ఫ్రాన్స్ ఈ నియమాన్ని అమలు చేస్తోంది. పూర్తిగా టీకాలు వేయించుకున్న వారిని మాత్రమే పబ్లిక్ స్థలాలకు అమనుతి ఇవ్వనున్నారు. సినిమాలు, నైట్‌క్లబ్‌లకు వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ చట్టం వర్తించనున్నది. నిజానికి వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ చట్టానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో రాలీలు జరిగాయి. వందలాది మందిని అరెస్టు చేశారు. అయినా అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ మాత్రం వెనుకడుగు వేయలేదు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే.. సినిమా హాళ్లు, నైట్ క్లబ్‌లకు అనుమతి కల్పించనున్నారు. కొత్త వేరియంట్లతో వైరస్ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో మాక్రన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రోజువారి దినచర్యలో పాల్గొవాలంటే.. వ్యాక్సిన్ తప్పనిసరి అని ప్రభుత్వం తీర్మానించింది. రెండు రోజుల పాటు జరిగిన చర్చ తర్వాత ఈ చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.