శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Feb 27, 2020 , 02:37:27

హమ్మయ్య.. తిరిగొస్తున్నాం

హమ్మయ్య.. తిరిగొస్తున్నాం

టోక్యో: కరోనా కలకలం నేపథ్యంలో జపాన్‌కు చెందిన ‘డైమండ్‌ప్రిన్స్‌' నౌకలో కొన్ని రోజులపాటు చిక్కుకున్న భారతీయ సిబ్బంది, ప్రయాణికుల్లో కొందరికి ఊరట లభించింది. ఫిబ్రవరి 3 నుంచి యోకోహోమా పోర్టులో నిలిపివేసిన ఈ నౌకలోని 3711 మందిలో 138 మంది భారతీయులున్నారు. అయితే వైరస్‌ సోకని వారిని ఇటీవల నౌక నుంచి బయటకు తరలించారు. వీరిలోని భారతీయులు బుధవారం ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కారు. కాగా 15 టన్నుల వైద్య సామగ్రితో కూడిన భారతీయ వాయుసేన విమానం కరోనా వ్యాప్తికి మూలమైన చైనాలోని వుహాన్‌కు మంగళవారం చేరుకుంది.


logo