సోమవారం 13 జూలై 2020
International - Jun 12, 2020 , 15:52:55

కాబూల్‌లోని మసీదులో పేలుడు... నలుగురు మృతి

కాబూల్‌లోని మసీదులో పేలుడు... నలుగురు మృతి

 అఫ్గానిస్థాన్‌ : కాబూల్‌లోని మసీదులో ఐఈడీ పేలుడు సంభవించింది. షేర్‌షా సూరీ మసీద్‌లో సంభవించిన ఈ పేలుడులో ఇమామ్‌ సహా నలుగురు మృతిచెందారు. పలువురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా బాంబు పేలుడు సంభవించింది. పేలుడుకు తామే కారణమని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo