బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 11:22:44

పాకిస్తాన్‌ ఆఫ్ఝన్‌ సరిహద్దులో కాల్పులు.. నలుగురు పాక్‌ సైనికులు మృతి

పాకిస్తాన్‌ ఆఫ్ఝన్‌ సరిహద్దులో కాల్పులు.. నలుగురు పాక్‌ సైనికులు మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్, ఆఫ్ఘన్ సరిహద్దులో ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆదివారం నలుగురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు పాకిస్తాన్‌ ఆర్మీ తెలియజేసింది. ఉత్తర వజిరిస్తాన్ జిల్లాలో మిరాన్షా పట్టణంలోని వెజ్దా సార్ ప్రాంతంలో ఉగ్రవాదులపై పాక్‌ దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ నిర్వహించినప్పుడు ఈ సంఘటన జరిగింది. పాక్‌ సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన వెంటనే ఆఫ్ఝన్‌ ఉగ్రవాదులు కాల్పులు జరుపడంతో నలుగురు సైనికులు మృత్యువాత పడ్డారు. తరువాత కాల్పుల్లో పాక్‌ దళం మిగతా ఉగ్రవాదులందరినీ చంపింది. 

మృతి చెందిన సైనికుల్లో సిపాయి ముహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, ముహమ్మద్ షాబాజ్ యాసిన్, రాజా వహీద్ అహ్మద్, ముహమ్మద్ రిజ్వాన్ ఖాన్‌ ఉన్నట్లు గుర్తించారు. అఫ్ఝన్‌ ఉగ్రవాదులు తరుచూ పాక్‌ భద్రతా దళాలపై దాడులు జరుపుతుంటారని అధికారులు పేర్కొన్నారు. గత నెలలో కూడా జిల్లాలో బాంబుతో పెట్రోలింగ్ వాహనాన్ని పేల్చి ఇద్దరు సైనికుల మరణానికి కారణమైనట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo