శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 17:49:53

ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పాక్‌ సైనికులు మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పాక్‌ సైనికులు మృతి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని ఉత్తర వజిరిస్తాన్‌ జిల్లాలో పాక్‌ సైనికులకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు పాకిస్థాన్‌ సైనికులు మృతి చెందారు. మిరాన్‌షా బోయ నైరుతీ ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరంలోని వెజ్దాసర్‌ ఐవోబీలో ఈ ఘటన జరిగిందని ఇంటర్‌ సర్వీసెస్‌ మిలటరీ మీడియా సంబంధాల శాఖ వెల్లడించింది. వెజ్దాసర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న ఇంటలీజెన్స్‌ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.  భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. గత నెల వజిరిస్థాన్లో పాక్‌ సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో ఇంతవరకు తెలియరాలేదు. 


logo