శనివారం 04 జూలై 2020
International - Jun 25, 2020 , 01:55:23

ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన

ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన

ఇస్లామాబాద్‌, జూన్‌ 24: పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయానికి పునాది రాయి పడింది. మంగళవారం ఆ దేశ మానవ హక్కులపై పార్లమెంటరీ కార్యదర్శి లాల్‌చంద్‌ మాల్హీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. రూ.10 కోట్ల వ్యయంతో ఇస్లామాబాద్‌లోని హెచ్‌-9 ప్రాంతంలో ఈ ఆలయాన్ని (కృష్ణా దేవాలయం) నిర్మిస్తున్నారు. లాల్‌చంద్‌ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఇస్లామాబాద్‌లో హిందువుల జనాభా పెరుగుతున్నదని, కాబట్టి వీరి కోసం ఓ ఆలయం అవసరమని చెప్పారు. 


logo