e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News అది డైనోసార్‌ శిలాజం కాదు.. నాగా బ‌ల్లుల‌ది!

అది డైనోసార్‌ శిలాజం కాదు.. నాగా బ‌ల్లుల‌ది!

అది డైనోసార్‌ శిలాజం కాదు.. నాగా బ‌ల్లుల‌ది!

న్యూఢిల్లీ: ప్ర‌పంచంలోనే అతి చిన్న డైనోసార్‌ది అంటూ గ‌తేడాది మార్చిలో ఉత్త‌ర మ‌య‌న్మార్‌లో ఓ శిలాజాన్ని గుర్తించారు. ఇది 9.9 కోట్ల ఏళ్ల కింద‌టిది అని అన్నారు. కానీ నేచ‌ర్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ఈ అధ్య‌య‌నంపై అప్ప‌టి నుంచి వివాదం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా క‌రంట్ బ‌యాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన కొత్త అధ్య‌య‌నం మాత్రం అది అస‌లు డైనోసార్ శిలాజం కానేకాద‌ని తేల్చింది. అది ఒక్యులుడెంటావిస్ అనే అంత‌రించిపోయిన బ‌ల్లుల జాతికి చెందిన శిలాజ‌మ‌ని ఈ అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది. ఇది హ‌మ్మింగ్‌బ‌ర్డ్ సైజులో ఉన్న అతిచిన్న డోనోసార్ శిలాజ‌మ‌ని గ‌తంలో నేచ‌ర్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌యనం చెప్పింది.

కానీ తాజా అధ్య‌య‌నం మాత్రం అది ఒక్యులుడెంటావిస్ నాగా జాతికి చెందిన బ‌ల్లిద‌ని చెబుతోంది. మ‌య‌న్మార్‌లో నివ‌సించే నాగా ఆదివాసీల గౌర‌వార్థం దీని పేరు చివ‌ర్లో నాగాను చేర్చారు. ఈ కొత్త అధ్య‌య‌నాన్ని యూనివ‌ర్సిటీ ఆఫ్ బ్రిస్ట‌ల్ ప‌రిశోధ‌కులు నిర్వ‌హించారు. వీళ్లు ఆ శిలాజాని సీటీ స్కాన్లు నిర్వ‌హించారు. ఇందులోని ప్ర‌తి ఎముక‌ను రెండు జాతుల‌తో పోల్చి చూశారు. చివ‌రికి ఇది డైనోసార్ కాదు నాగా బ‌ల్లి జాతికి చెందిన శిలాజ‌మ‌ని తేల్చారు. పొడువైన‌, దెబ్బ‌తిన్న ముక్కు, పుర్రెను చూసి దీనిని మొద‌ట డైనోసార్‌గా భావించార‌ని, కానీ క్షుణ్నంగా ప‌రిశీలించిన త‌ర్వాత ఇదొక బ‌ల్లిద‌ని తేలిన‌ట్లు పరిశోధ‌కులు చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అది డైనోసార్‌ శిలాజం కాదు.. నాగా బ‌ల్లుల‌ది!
అది డైనోసార్‌ శిలాజం కాదు.. నాగా బ‌ల్లుల‌ది!
అది డైనోసార్‌ శిలాజం కాదు.. నాగా బ‌ల్లుల‌ది!

ట్రెండింగ్‌

Advertisement