గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 01, 2020 , 16:34:36

ప్రణబ్ మరణం.. భారత్‌తో స్నేహానికి తీరని నష్టం: చైనా

ప్రణబ్ మరణం.. భారత్‌తో స్నేహానికి తీరని నష్టం: చైనా

బీజింగ్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం భారత్, చైనా స్నేహానికి పెద్ద నష్టమని చైనా తెలిపింది. ఆయన మరణంపట్ల మంగళవారం ఆ దేశం సంతాపం వ్యక్తం చేసింది. మాజీ రాష్ట్రపతి ముఖర్జీ భారత రాజకీయ నేతల్లో ప్రముఖ వ్యక్తి అని కొనియాడింది. ఆయన 50 ఏండ్ల రాజకీయాల్లో చైనా, భారత్ సంబంధాలకు ఎంతో దోహదపడ్డారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునింగ్ మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. 2014లో తమ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్ సందర్శించినప్పుడు నాడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌తో కలిసి ఇరుదేశాల భాగస్వామ్య నిర్మాణం కోసం సంయుక్త ప్రకటన చేసినట్లు గుర్తుచేశారు. 2016లో ముఖర్జీ చైనాను సందర్శించారని, చైనా నేతలతోపాటు వ్యాపార వర్గాలతో సమావేశమైనట్లు తెలిపారు. ప్రణబ్ మరణం భారత్‌తో పాటు చైనాతో సంబంధాలకు తీరని లోటు అని చెప్పారు. ముఖర్జీ మరణంపై మీడియా అడిగిన ఒక ప్రశ్నకు హువా చునింగ్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
logo