బుధవారం 03 జూన్ 2020
International - May 02, 2020 , 14:58:38

కరోనా ఎఫెక్ట్‌..నవాజ్ షరీఫ్‌ గుండె శస్త్రచికిత్స వాయిదా

కరోనా ఎఫెక్ట్‌..నవాజ్ షరీఫ్‌  గుండె శస్త్రచికిత్స వాయిదా

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌  గుండె శస్త్రచికిత్స  వాయిదా పడింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సర్జరీ నిలిపివేసినట్లు షరీఫ్‌ కూతురు మర్యమ్‌ షరీఫ్‌ తెలిపారు. 'కరోనా వైరస్‌ కారణంగా నవాజ్‌ షరీఫ్‌కు జరగాల్సిన శస్త్రచికిత్స వాయిదా పడింది. మియాన్ సాహిబ్ అధిక ప్రమాదం ఉన్న పేషెంట్‌ అని ఈ సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది..మీ అందరి ఆశీస్సులు కావాలని' ఆమె ట్వీట్‌ చేశారు. లండన్‌లో నవాజ్ షరీఫ్ కుటుంబానికి చెందిన 4 విలాసవంతమైన ఆస్తుల యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసులో అవినీతికి  పాల్పడ్డారనే కేసులో షరీఫ్‌కు    జైలుశిక్ష పడింది. అవినీతి ఆరోపణల కేసులో విచారణకు హాజరుకానందున షరీఫ్‌కు గత వారం నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. 


logo