శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 10:31:36

అవినీతి కేసుల్లో దోషిగా మలేషియా మాజీ ప్ర‌ధాని

అవినీతి కేసుల్లో దోషిగా మలేషియా మాజీ ప్ర‌ధాని

హైద‌రాబాద్‌: ల‌క్ష‌ల డాల‌ర్ల అవినీతి కేసులో మ‌లేషియా మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్ దోషిగా తేలారు. మొత్తం ఏడు అభియోగాల్లో న‌జీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ కేసుల్లో ఆయ‌న‌కు 12 ఏళ్ల జైలుశిక్ష‌ను విధించారు. మ‌నీలాండ‌రింగ్‌, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ‌లేద‌ని న‌జీబ్ కోర్టుకు తెలిపారు. మ‌లేషియా డెవ‌ల‌ప్‌మెంట్ బెర్హాద్‌(వ‌న్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ఆ ఫండ్ నిధుల‌ను దుర్వినియోగం చేశార‌ని కేసు న‌మోదు అయ్యింది.  ఆ ఫండ్ నుంచి సుమారు ప‌ది మిలియ‌న్ల డాల‌ర్ల అమౌంట్‌ను ప్ర‌ధాని ప్రైవేటు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2009 నుంచి 2018 వ‌ర‌కు న‌జీబ్ మ‌లేషియా ప్ర‌ధానిగా చేశారు. ఈ కేసులో మాజీ ప్ర‌ధాని న‌జీబ్‌కు 15 నుంచి 20 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.  



logo