జకర్తా : (Indonesia) ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుకర్ణో చిన్న కుమార్తె సుక్మావతి సుకర్ణోపుత్రి హిందూ మతంలోకి మారేందుకు నిశ్చయించారు. ఈ నెల 26న ఆమె ఇస్లాంను వీడి హిందూ మతాన్ని స్వీకరించనున్నారు. హిందూ మతంలోకి మారడానికి సాంప్రదాయ వేడుక మంగళవారం నాడు బాలిలోని బాలే అగుంగ్ సింగరాజా బులెలెంగ్ రీజెన్సీలోని సుకర్నో సెంటర్ హెరిటేజ్ ఏరియాలో నిర్వహించనున్నారు. సుక్మావతి సుకర్ణోపుత్రి, సుకర్ణో మూడవ కుమార్తె, మాజీ అధ్యక్షుడు మేఘవతి సుకర్ణోపుత్రి చెల్లెలు.
2018లో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు సుక్మావతి సుకర్ణోపుత్రిపై దైవదూషణ ఫిర్యాదు చేశాయి. ఇస్లాం మతాన్ని కించపరుస్తూ కవితను పఠించారని ఆరోపించాయి. దీనిపై అప్పుడే క్షమాపణ చెప్పినట్లు ది సండే మార్నింగ్ హెరాల్డ్ వార్తను ప్రచురించింది. ఇండోనేషియాలో అత్యధిక సంఖ్యలో ఇస్లాం ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఆగ్నేయాసియా దేశం నిజానికి ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం కూడా.
సుక్మావతి సుకర్ణోపుత్రి గతంలో అనేక హిందూ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూ మతంలోని మత పెద్దలతో సంభాషణలు జరిపారు. ఆమె మత మార్పిడి నిర్ణయానికి ఆమె సోదరులు, గుంటూ సూకర్ణోపుత్ర, గురు సూకర్ణోపుత్ర, సోదరి మేఘావతి సూకర్ణోపుత్రి తదితరులు మద్దతు ఇచ్చారు. ఆమె పిల్లలు పర్వీరా ఉతమా, ప్రిన్స్ హర్యో పౌండ్రాజర్న సుమౌత్రా జీవనేగారా, గుస్తీ రాడెన్ ఆయు, కుమార్తె సినీవతి కూడా నిర్ణయాన్ని స్వాగతించారు.
అందరికీ అందుబాటులోకి వచ్చేలా సాహిత్య పునరుజ్జీవం జరగాలి : వెంకయ్యనాయుడు
కేసీఆర్ మంచి పనులే ‘గెల్లు’ను గెలిపిస్తాయి : టీఆర్ఎస్వీ
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంటా..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హనీట్రాప్‌లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్‌లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..