ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 02:11:05

శాంతికి పంచసూత్రాలు

శాంతికి పంచసూత్రాలు

  • =సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపునకు ఐదు సూత్రాల ప్రణాళిక 
  • భారత్‌- చైనా విదేశాంగమంత్రుల నిర్ణయం 

మాస్కో: సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొల్పేందుకు భారత్‌- చైనా ఐదు సూత్రాల విధానాన్ని ఆమోదించాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వెంటనే సాధారణ స్థాయికి తేవాలని నిర్ణయించాయి. రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో) సమావేశాల సందర్భంగా భారత్‌, చైనా విదేశాంగ మంత్రులు ఎస్‌ జైశంకర్‌, వాంగ్‌ ఈ గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. రెండున్నర గంటలపాటు సాగిన చర్చల్లో ఎల్‌ఏసీ వెంట బలగాలను వెంటనే ఉపసంహరించాలని అంగీకరించారు. సరిహద్దు సమస్యలను ఐదు సూత్రాల విధానం వెలుగులో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం త్రివిధ దళాధితులతో సమావేశమయ్యారు. తూర్పు లఢక్‌లో ప్రస్తుత పరిస్థితిని ఈ భేటీలో సమీక్షించారు.


logo